
– నా జీవితం ఉన్నంతవరకు వేములవాడ గడ్డ రుణం తీర్చుకుంటా
– మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
నవతెలంగాణ – వేములవాడ : వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు తన గెలుపునకు ప్రత్యేక కృషి చేసిన తన కుల బంధావులకు వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ అండదండతో సంఘ అభివృద్ధికీ ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలు నేరుగా నా ఇంటికి రావచ్చని, వారి సమస్యల పరిష్కారం పట్ల కృషి చేస్తానని, గృహలక్ష్మి పథకం కింద నిరుపేదలైన లబ్ధిదారులకు స్థలముంటే ఐదు లక్షల 4 వేల రూపాయలు అందించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, త్వరలోనే వారికి లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. అనంతరం ఆయనను శాలువాలతో గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు బింగి శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు వారాల దేవయ్య ప్రధాన కార్యదర్శి సోమినేని మహేష్,ఉపాధ్యక్షులు కోయినేని బాలయ్య,ఉప్పుల దేవరాజు,ఆకుల శ్రీనివాస్, వరి లక్ష్మీనారాయణ,కోశాధికారి రామతిర్థపు వెంకన్న, నామాల శేఖర్, తోట వెంకటేశం మున్నూరు కాపు ప్రచార కార్యదర్శి తోట అనీల్ కుల జాతీయ నాయకులు చిలుక రమేష్ మాజీ అధ్యక్షులు మున్నూరు కాపు కుల సభ్యులు పాల్గొన్నారు.