మున్నూరు కాపు సంఘం కమిటీ ఎన్నిక

– మున్నూరు కాపు సంఘం మండల ప్రధాన కార్యదర్శి పాశం రమేష్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని రామన్నగూడెం గ్రామ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేసినట్లు మున్నూరు కాపు సంఘం మండల ప్రధాన కార్యదర్శి పాశం రమేష్ తెలిపాడు. మండలంలోని రామన్నగూడెం గ్రామంలో ఆ సంఘం సభ్యులతో కలిసి ఏకాగ్రీవంగా ఆ గ్రామ కమిటీని ఎన్నిక చేసి నియామక పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని శుక్రవారం మండల ప్రధాన కార్యదర్శి పాశం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపు నూతన కార్యవర్గాన్ని కుల సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్ని కోవడం జరిగింది అని తెలిపాడు. మున్నూరు కాపు సంఘం ఎన్నికలు మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకుంటామని తెలిపాడు. ఎన్నికల లో రామన్నగూడెం గ్రామ నూతన అధ్యక్షుని గా కనకం కిష్టయ్య, ఉపాధ్యక్షుని గా గాండ్ల రాజు ,సూధం  లక్ష్మీనారాయణ,  ప్రధాన కార్యదర్శి కనకం వీరయ్య, కోశాధికారిగా, ఆకుతోట రాజ్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా, సింగంశెట్టి శెట్టి కొమురయ్య, గోలి యాదగిరి, గాండ్ల వెంకన్న,  గౌరవ అధ్యక్షులు బండి సోమయ్య సలహాదారు ఆకుతోట సోమనర్సయ్య లను ఎన్నిక చేసామని తెలిపాడు. నూతన గ్రామ శాఖ అధ్యక్షుడు కనకం క్రిష్టయ్య మాట్లాడుతూ మన హక్కుల కోసం మనం పోరాడాలని అందుకోసం మనందరి ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకునేంతవరకు ఉద్యమించాలని అన్నారు. మనకు మన సమస్యలు పరిష్కరించేందుకు ఒక కమ్యూనిటీ హాలు భవనాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేయాలని అన్నారు. ఏదైనా సమస్య వస్తే ఎక్కడి వరకైనా వెళ్లేందుకు అందరు కలిసికట్టుగా ఉండి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు సభ్యుల సమస్యలు పరిష్కరించేందుకు నా వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ  కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పాశం వీరయ్య, ఆకుతోట రామన్న, బండి శీను,  సభ్యులు పాల్గొన్నారు.