– ఉత్తర తెలంగాణ జిల్లాల మున్నూరు కాపు సంఘం ప్రారంభించిన కొండ దేవయ్య..
నవతెలంగాణ – వేములవాడ
నవతెలంగాణ – వేములవాడ
మున్నూరు కాపులు ఐక్యంగా ఉండి గ్రామ స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు రాజకీయంగా ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని అన్నారు. ఆదివారం వేములవాడలోనీ మున్నూరు కాపు సంఘ భవనంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన మున్నూరు కాపు సంఘం కార్యాలయాన్ని కొండ దేవయ్య ప్రారంభించారు. రాష్ట్ర నేతలతో పాటు, 33 జిల్లాల నుండి మున్నూరు కాపు సంఘం జిల్లా నేతలు, మండల, పట్టణ, గ్రామాల నేతలు కొండ దేవయ్య ను ఘనంగా సన్మానించారు.అనంతరం కొండ దేవయ్య మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం లో ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన మున్నూరు కాపు సంఘం కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే, ఉత్తర తెలంగాణ జిల్లాలకు కార్యాలయము అందుబాటులో ఉంటుందని అని అన్నారు. కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో వేములవాడలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనీ తెలిపారు.మున్నూరు కాపులు ఐక్యంగా ఉండి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు రాజకీయంగా ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మున్నూరు కాపులకు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి అట్టి కార్పొరేషన్ కు 3000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలుపుకోవాలని ప్రభుత్వాన్ని కొండ దేవయ్య కోరారు.ఈ సమావేశంలో రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు రత్నాకర్, రాష్ట్ర యువత కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్ తో పాటుగా బొరిగం రాజారాం,వాసుదేవుల వెంకట నరసయ్య,కతుకం పెంటైః,మలుక రామస్వామి,ఆర్జీసి కృష్ణ,మల్లయ్య,గోత రాజేందర్,చిన్నారెడ్డి, శ్రీనివాస్,నీలం నర్సింహులు,గంగన్న,కొండ కనుకయ్,కొండ నర్సయ్య, రాష్ట్ర బీసీ సాధికారిత సంఘం నేతలు బస్సాపూర్ శంకర్,బాజినేని రాజేందర్, పొలాస నరేందర్, పొలాస వాసు,గాజుల బాలయ్య, తూపుకారి సత్తయ్య తో పాటు తదితరులు ఉన్నారు.