అసెంబ్లీ సమావేశాల్లో కారు గాలి తీసిన మునుగోడు ఎమ్మెల్యే..

Mungodu MLA who blew up the car in assembly meetings..– బీఆర్ఎస్ పదేపదే చెప్పుకునే  ఉచిత కరెంటు కాన్సెప్టే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది..
– సభకిరాని శాసనసభ ప్రతిపక్ష నేత ఉన్న ఒకటే లేకున్నా ఒకటే..
– ఆత్మబలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.
– తెలంగాణ రాష్ట్రానికి నేను రాజుని నా తర్వాత నా కొడుకు రాజు అని కేసిఆర్ భావించుకున్నాడు.. 
– 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్ రానివ్వలేదు…
– బాధ్యతాయుతంగా ఆలోచించి ప్రజలకు ప్రజా పాలన అందిస్తాం..
– మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
నవతెలంగాణ – మునుగోడు
సారు.. కారు ..16 అని విర్రవీగిన వాళ్లకు  ఎంపీ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా రాకుండా గుండు సున్నా స్థానంకే పరిమితమయ్యారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలలో గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వ చేసిన వైఫల్యాలను అసెంబ్లీలో ప్రసంగిస్తూ సార్ ఎక్కడ పోయిండు .. కార్ ఎక్కడ పోయింది … 16 స్థానాలు ఎక్కడ పోయాయి అధ్యక్ష అంటూ కారు గాలి తీసినంత పని చేశారు. పవర్ సెక్టర్లో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు పవర్ సెక్టర్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని అన్నారు.టిఆర్ఎస్ పదేపదే  రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం కాదు , ఉచిత కరెంటు కాన్సెప్టే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప పథకం అని అన్నారు.అప్పట్లోనే రైతుల పక్షపాత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి నిరూపించుకుంది అని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడినాటికి 2900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రణాళికలు చేసి పెట్టారు, నాటి యుపిఏ  ప్రభుత్వం పున ర్విభజన చట్టంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుద్దని  చర్యలు తీసుకోవడం వల్ల 1800 మెగావట్ల కరెంటు అదనంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది అని తెలియజేశారు. శాసనసభలో  ప్రతిపక్ష నేత  ఉంటే బాగుండేది . మేము చెప్పే విషయాలు విని ఏమైనా సూచనలు ఇస్తే బాగుండేది, కానీ ఆయన సభకి రాడు , సభకిరాని  శాసనసభ ప్రతిపక్ష నేత ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అని ఘాటుగా విమర్శించారు. మీకు సమాధానం చెప్పడానికి మా స్థాయి చాలు అని మిగతా సభ్యులు అంటున్నారు, మీ స్థాయి ఏంటో 10 సంవత్సరాలల్లో తెలిసిపోయింది. కనీసం మంత్రులు , ఎమ్మెల్యేల మాటలు కూడా అధికారులు వినలేని పరిస్థితి కి తీసుకువచ్చారని మండిపడ్డారు. అప్పుల పాలైన  విద్యుత్ సంస్థను గాడిలో పెట్టడానికి  మేము ప్రయత్నం చేస్తున్నాం.
ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వం చేసే వాటికి సహకరించి సూచనలు ఇవ్వండి.  కానీ సభలో, బయట ముఖ్యమంత్రి పైన ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ రాజకీయం చేస్తు మీ రాజకీయ ప్రయోజనాల కోసం సభను వాడుకోవద్దు ప్రతిపక్ష సభ్యులకు సూచించారు. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలుపెట్టిన పవర్ ప్రాజెక్టు ల్లో అప్పటికే అందుబాటులో కి వచ్చిన సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాదని, కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడంతో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్  నిర్మాణంలో  కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం వల్ల తరచూ సమస్యలు వస్తున్నాయి అని ఆరోపణ చేశారు. వెయ్యి మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో  టిఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని అన్నారు.టెండర్స్ సిస్టం ఫాలో కాకుండా  వాళ్లకు నచ్చిన వారికి  నామినేషన్ పద్ధతిలో  నిర్మాణ పనులు కట్టబెట్టారని ఆరోపించారు.రాష్ట్రంలో కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన తర్వాత కిరీటం వచ్చిందని మేము సంతోష పడట్లేదు ,ప్రతి చిన్న విషయాన్ని బాధ్యతాయుతంగా ఆలోచించి  చేస్తూ ప్రజలకు సమాధానం చెబుతు పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల జరిగిన నష్టాన్ని , నిర్వాకాన్ని త్వరలోనే    సంఖ్యలతో సాక్షలతో సహా ప్రజలకు వివరిస్తాం అని అన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా థర్మల్ పవర్ స్టేషన్  కోల్ మైన్స్ పక్కన పెడతారు…? నల్గొండ జిల్లా దామరచర్ల వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఇప్పటికీ  తెలియదు..! 25 వేల కోట్ల ప్రాజెక్ట్ అనుకుంటే 36 వేల కోట్లకు పెరిగింది. బీహెచ్ఈఎల్ కు 20 వేల కోట్ల వరకు నామినేషన్  ప్రతిపదికన ఇచ్చారు. మిగతా పనులన్నీ కాంట్రాక్టర్లకు టెండర్ సిస్టం ఫాలో కాకుండా  ఇష్ట రీతిన ఇచ్చారు అని ఆరోపించారు.ఎన్టిపిసి ఉత్పత్తి చేసి 2400 మెగా వట్ల కరెంటు ఇస్తామన్న.. అది తీసుకోకుండా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు.కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేయడం బాధాకరం అని అన్నారు.10 ఏండ్ల కాలంలో వ్యవస్థలను చిన్నభినం చేసి  తెలంగాణ రాష్ట్రానికి నేను రాజుని నా తర్వాత నా కొడుకు రాజు అని కేసిఆర్ భావించుకున్నాడని అన్నారు.
ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతోని కాళ్లు మొక్కించుకున్న చరిత్ర కెసిఆర్ ది అని మండిపడ్డారు. వీళ్ళు చేసిన పాపాల గురించి చెప్పాలంటే గంటలు సరిపోవు అధ్యక్ష అంటూ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అధికారంలోకి ఎలా రావాలి అధికారం ఎలా నిలబెట్టుకోవాలనే తప్ప ప్రజలకు మంచి చేయాలని కాదు అని చెప్పుకొచ్చారు. గతంలో వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతుంటే  మైక్ కట్ చేసేవారు ,వందమంది కౌరవుల లాగా  మాపై దాడి చేసేవారు.తెలంగాణ కోసం పార్లమెంట్లో పోట్లాడుతుంటే నా జీవితం ధన్యమైంది అని చాలా సంతోషించాను.కానీ ఆ సంతోషం లేకుండా చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీకి  పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్ లేకుండా చేశారంటే ఎంత అవినీతి , ఎంత దౌర్జన్యాలు చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.కరెంటు విషయంలో రైతుల విషయంలో  కాంగ్రెస్ ప్రభుత్వం నూటికి నూరు శాతం కట్టుబడి ఉంది రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తామని అన్నారు. గృహ జ్యోతి  పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం .పవర్ సెక్టారులో నూతన టెక్నాలజీ  ని ప్రవేశపెట్టి రైతులకు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తాం అని అన్నారు.