మునుగోడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌ హన్నూబాయికి కేటాయించాలని వినతి

నవతెలంగాణ-చౌటుప్పల్‌
మునుగోడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కెట్‌ ఎమ్‌డి.హన్నూబాయికి కేటాయించాలని కోరుతూ సోమవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌కు చౌటుప్పల్‌ మండల టీడీపీ అధ్యక్షులు ఎమ్‌డి.హన్నూబాయి, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లి దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుప్పల్‌లో టీడీపీ మండల అధ్యక్షునిగా హన్నూబాయి కొనసాగుతూ పార్టీ అభివద్ధి కోసం ఎంతో కషిచేస్తున్నారని తెలిపారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ, మండలంలో 64వేల ఓట్లు ఉన్నాయన్నారు. మునుగోడు టిక్కెట్‌ హన్నూబాయికి ఇవ్వాలని నాయకులు, కార్యకర్తలు జ్ఞానేశ్వర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బడుగు లక్ష్మయ్య, సిలివేరు నర్సింహా, బొమ్మిరెడ్డి మల్లారెడ్డి, ఎమ్‌డి.వహీద్‌, పాశం రఘుపతి, తొర్పునూరి శ్రీనివాస్‌గౌడ్‌, గుమ్మడి అంజిరెడ్డి, నర్సిరెడ్డి, ఎమ్‌డి.ఘనీ, ముఖేశ్‌గౌడ్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.