చండూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్ గా యం.డి. మున్వార్ అలీ శనివారం బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడ కమిషనర్ గా పనిచేసిన వెంకట మణికరణ్ దీర్ఘ కాలిక సెలవులో వెళ్లారు. నూతన కమిషనర్ హాలియా మున్సిపాలిటీ నుండి బదిలీ పై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజలకు అందుబాటులో వుంటూ సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు , పార్టీ నేతలు మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలన్నారు.