జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామ నేతకాని సంక్షేమ సమితి కమిటీని, మంగళవారం ఆ సంఘం రాష్ట్ర నాయకులు గొర్లకుంట ప్రభుదాస్, తాళ్లపల్లి రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా తోంగూరి గంగయ్య, అధ్యక్షుడిగా కొండగుర్ల కాంతయ్య, ఉపాధ్యక్షుడిగా జాడి తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా ఇందన్ పల్లి రాయలింగు, సంయుక్త కార్యదర్శులుగా ఇంధన్ పల్లి శ్రీనివాస్, ఇందన్ పల్లి రాజేశ్,, కోశాధికారిగా జాడి వంశీ, ప్రచార కార్యదర్శిగా జాడి రాయలింగును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా రాజన్న గంగన్న పెద్దలు సలహాదారులుగా జాడి రాజేశ్వర్ శ్రీనివాస రత్నం మాణిక్యం, చిన్న రాజం శంకర్ బాణాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నేతకాని మహర్ సంక్షేమ సంఘం అభివృద్ధికి, సంఘ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు వచ్చే పొలాల అమావాస్యను ఘనంగా నిర్వహించడానికి సంఘ సభ్యులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నేతకాని సంఘం మండల అధ్యక్షుడు రత్నం లక్ష్మణ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి వెంకట్ రాష్ట్ర నాయకులు జాడి గంగాధర్ మల్లయ్య, అమృత రావు నందయ్య, తదితరులు పాల్గొన్నారు.