రామ్ చరణ్, ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సానతో మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ స్థాయిలో నిర్మాత వెంకట సతీష్ కిలారు ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మెగా వెంచర్ కోసం ఆస్కార్-విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నారు. శనివారం రెహ్మాన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారి కంగా అనౌన్స్ చేశారు. బుచ్చిబాబు ‘ఉప్పెన’ మ్యూజికల్ హిట్, రెండవ చిత్రం కూడా మ్యూజికల్ చార్ట్‌బస్టర్ కాబోతుంది. రెహమన్ సంగీతం ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి ప్రధాన ఆకర్షణగా ప్రేక్షకులను అలరించనుంది.