చిన్న షక్కర్గలో భక్తిశ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకున్న ముస్లిం సోదరులు

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గ గ్రామంలో గురువారం నాడు ఆ గ్రామ సర్పంచ్ షేక్ గఫర్ ఆధ్వర్యంలో ముస్లిమ్స్ సోదరులందరూ బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకున్నారు. ఒకరినొకరు అలింగ మనం చేసుకుంటూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ గ్రామంలో ముస్లిం సోదరులంతా ఒకచోట కూర్చొని ఉత్సవంగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.