– ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్/దుండిగల్
కుత్బుల్లాపూర్‌లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద శుక్రవారం నియోజకవర్గానికి చెందిన పలువురు మైనారిటీ నాయకులు, ముస్లిం సోదరులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌ను కలిసి సత్కరించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లా దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. మరొక మారు ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
‘శివ సాయి కన్వెన్షన్ సెంటర్’ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్…
కుత్బుల్లాపూర్ : బోయిన్‌పల్లి డైరీ ఫామ్ రూట్‌లో శ్రీనివాస్ రెడ్డి, మనోహర ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివ సాయి బాంకెట్ హాల్‌ను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో శుభకార్యాలు నిర్వహించుకు నేందుకు ఇలాంటి బాంకెట్ హాల్‌లు ఎంతగానో ఉపయోగపడతా యన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కెఎం.గౌరీష్, గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, కిషోర్ చారి, సత్తిరెడ్డి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
శీ వెంకటేశ్వర, శివ వీరాంజనేయ స్వామి దేవస్థానం 20వ వార్షికోత్సవ పూజలు..
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, 132- జీడిమెట్ల డివిజన్ జీడిమెట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర శివ వీరాంజనేయ స్వామి దేవస్థానం 20వ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. ఆ అన్నపూర్ణ విశ్వనాథ స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. ఈ కార్యక్రమం లో గాజుల రామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి, గాజుల రామారం డివిజన్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, ఆలయ కమిటీ సభ్యులు జయరాం రెడ్డి, కష్ణారావు, రాఘవేందర్ రావు, బీరప్ప, శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.