మిలాద్ ఉన్ నబి వేడుకలు జరుపుకున్న ముస్లింలు

నవతెలంగాణ – శంకరపట్నం
మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం లు,మిలాద్ ఉన్ నభి పండుగను పురస్కరించుకొని గురువారం శంకరపట్నం మండల కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముస్లింలు కేశవపట్నం మసీదు నుండి బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మసీద్ కమిటీ అధ్యక్షుడు కాజా మైనుద్దీన్ మాట్లాడుతూ, అనంత కరుణ మయుడైన అల్లాహు సర్వ మానవాళి శ్రేయస్సు శాంతిని నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్త మహమ్మద్ ఎన్నుకున్నట్లు,అంతిమ దైవ గ్రంధం పవిత్ర ఖురాన్ లో చెప్పబడిందని ఆయన పేర్కొన్నారు.ప్రవక్త చూపిన అడుగుజాడల్లో ప్రతి ముస్లిం సోదరులు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇసాముద్దీన్, ముస్లిం జెఎసి కన్వీనర్ సయ్యద్ ఆరిఫ్,గ్రామ మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు మీర్జా ఆరిఫ్ బేగ్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ఆబిద్, అమీర్, ఎండి కాజా, గౌస్ అయాన్, రియాజ్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.