నవతెలంగాణ – మోపాల్
రైతు భరోసా పథకానికి ఈ సంవత్సరం 1 జనవరి 2025 కొత్తగా వచ్చిన పట్టాదారు పుస్తకం గల రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని మోపాల్ మండల వ్యవసాయ అధికారి సౌమ్య మరియు విస్తరణ అధికారి రంజిత్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికిగాను రైతులు పాస్ బుక్ లేదా డిజిటల్ సంతకమైన జిరాక్స్ మరియు ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్ పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం ను వ్యవసాయ అధికారి గాని లేదా వ్యవసాయ విస్తరణ అధికారి గాని సమర్పించాలని వారు తెలిపారు. ఇంతకుముందు రైతు బంధు వచ్చిన వారు అవసరం లేదు కేవలం కొత్తగా పట్టమార్పిడి చేసుకున్న వారు మాత్రమే అప్లై చేసుకోవాలని వారు తెలిపారు.