– పెయింట్ వేసి పున:ప్రారంభానికి సిద్ధం
– ప్రధానోపాధ్యాయులు ఏ.మల్లేశా
– పచ్చదనం, పరిశుభ్రతతో విద్యార్థులకు స్వాగతం పలుకనున్న పాఠశాల
– తల్లిదండ్రులు తమ పిల్లలను తమ పాఠశాలలో చేర్పించాలి
– విజయవంతంగా బడిబాట కార్యక్రమం
నవతెలంగాణ-శంషాబాద్
రాష్ట్రస్థాయి ఉత్తమ పాఠశాల అవార్డు పొందిన మండల పరిధిలోని హుడా కాలనీ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల వచ్చే విద్యా సంవత్సరానికి సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. పాఠశాలకు పూర్తిగా పెయింట్ వేసి విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నది. శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ.మలేశా మాట్లాడుతూ.. హుడా కాలనీ ప్రాథమిక పాఠశాల ఎంతో ప్రగతి సాధించిందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు పెయింట్ వేశారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణంతో పాటు పచ్చదనం పరిశుభ్రత స్వాగతం పలుకు తుందని అన్నారు. ప్రభుత్వం అందించే అన్ని ఉచిత సౌకర్యాలు విద్యార్థులకు అందిస్తున్నా మని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తమ పాఠశాలలో చేర్పించాలని వారు కోరారు. వారికి మంచి విద్యను అందిస్తూ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు కృషి చేస్తామని ప్రాధానోపాధ్యాయులు తెలిపారు.