ముస్తాబైన సిద్దిపేట పురపాలక సంఘం..

నవ తెలంగాణ – సిద్దిపేట
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా సిద్దిపేట పురపాలక సంఘ కార్యాలయం విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబయింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంత్రి హరీశ్ రావు ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలతో అలంకరించబడ్డాయి.