మహాశివరాత్రి సందర్భంగా ముస్తాబైన త్రీ లింగ రామేశ్వర ఆలయం..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరు గ్రామంలో గల పురాతన త్రీ లింగ రామేశ్వర ఆలయం ముస్తాబయింది. మహాశివరాత్రి పురస్కరించుకొని తాండూర్ గ్రామంలో గల స్త్రీ లింగ రామేశ్వర ఆలయం వద్ద మూడు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించబడతాయి. శివరాత్రి సందర్భంగా మొదటి రోజు అభిషేకాలు తెల్లవారులు భజన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదే విధంగా శనివారం రోజు ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించబడుతుంది. మరుసటి రోజు ఆదివారం సాయంత్రం రాత్రి భజన కార్యక్రమాలు తెల్లవారుజామున రథోత్సవం నిర్వహించబడుతుంది. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. మూడు రోజులపాటు ఆలయం వద్ద భక్తుల సందడి జోరుగా కొనసాగుతుంది. పురాతనమైన శివాలయం దర్శనం చేసుకోవడానికి చాలా దూరాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుంది.