– అత్యధికంగా మునుగోడు.. అత్యల్పంగా నేరేడు కొమ్ములో నమోదు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో గత రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాలతో వానాకాలం సాగుకు ఊరట కలుగుతోంది. వర్షాకాలం ఆరం భమై సుమారుగా రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఒకటి, రెండు ఓ మోస్తరుగా కురిసిన వర్షాలు మినహా భారీగా కురవలేదు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు సాగు శాతం తక్కువగానే ఉంది. ఈ పరిస్థితుల క్రమంలో గత రెండు రోజులుగా కురుస్తున్న ముసురులకు వరి నాట్లు పనుల్లో కదలిక వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 8.3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. మరో కొన్ని రోజులు అల్పపీడనం కొనసాగటంతోపాటు, రుతుపవనాల ప్రభావం ఉండటంతో భారీ వర్షాలు కురుస్తాయేమోనని రైతులు గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్నారు. కురిసిన మోస్తరు వర్షానికే జిల్లాలోని పలు కాలనీలలో రోడ్లపై వర్షపునీరు నిలిచింది. ప్రజలు అత్యవసర పనులకు గొడుగులు ధరించి బయటకు రావడం తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా నేటికీ 168.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 233.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
మండలాల వారిగా వర్షపాతం ..
మునుగోడు 16.3 మి.మీ,నక్రేకల్ 14.0,తిప్పర్తి 13.9,కేతేపల్లి 13.8, శాలిగౌరారం 13.6,కనగల్ 13.2, మిర్యాలగూడ 10.6,కట్టంగూర్ 10.5,నల్గొండ 10.5, మాడుగులపల్లి 9.9,వేములపల్లి 9.9, నార్కెట్‌పల్లి 9.6, చిట్యాల్ 8.8, త్రిపురారం 8.5, చండూర్ 8.3,గుర్రంపోడ్ 8.2,గుండ్లపల్లి 8.0,నిడ్మనూరు 7.7,మర్రిగూడ 7.3, చింతపల్లి 6.8 దేవరకొండ 6.2,దామెరచెర్ల 5.8,తిరుమలగిరి సాగర్ 5.8,చందంపేట 5.1,నాంపల్లి 4.7,అనుముల 4.5,కొండ మల్లేపల్లి 4.0,గట్టుపాల్ 4.0,పి ఎ పల్లి 3.9, అడవిదేవులపల్లి 3.8,పెద్దవూర 3.8, నేరేడుగొమ్ము 3.0.