నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలోని చెందిన ప్రాథమిక పాఠశాల ప్రహరి గోడ ను ఈ నెల 29 వ తేది రాత్రి మూత్యంపేట మాజీ ఉపసర్పంచ్ శిరీష్ గౌడ్, అతని అనుచరులు డిసిఎం తో ఉద్దేశ పూర్వకంగా గుద్దడం వల్ల ప్రహరి గోడ కూలిపోయిదని , వారిపై చర్యలు తీసుకోవాలని మత్యంపేట గ్రామ ప్రజలు శుక్రవారం కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కి కామారెడ్డి ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. గ్రామస్తుల పిర్యాదు మేరకు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి స్పందించి వెంటనే జిల్లా ఎస్పీ కి పోన్ చేసి ముత్యంపేట్ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కూల్చివేతకు కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ కి సూచించడం జరిగిందనీ ముత్యంపేట గ్రామస్తులు పేరు కొన్నారు. నియోజకవర్గంలో ఎక్కడైనా, ఎవరైన ప్రభుత్వ ఆస్తుల విషయంలో కానీ, ప్రజల ఆస్తుల విషయంలో కానీ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని అన్నారన్నారు.