
వికలాంగుల ఫైనాన్స్ కోఆపరేటివ్ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించినందుకు గాను వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. సమస్త వికలాంగులు, పెరిక కులస్తులు ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ కి రుణపడి ఉంటారని ఆయన పేర్కొన్నారు. కాగా బాగా పనిచేసి ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు వీరయ్య తెలిపారు.