
తెలంగాణ యూనివర్సిటీ లోని న్యాయ కళాశాలలో ఎల్.ఎల్.బి చివరి సంవత్సర విద్యార్థులకు గురువారం ముట్( నమూనా) కోర్టు పరీక్షలు నిర్వహించినట్లు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్ పర్సన్ డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా తెలిపారు.ఈ పరీక్షలకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా నిజామాబాద్ సీనియర్ న్యా యవాది జే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ ముట్ కోర్టు పరీక్షలో భాగంగా విద్యార్థులకు రాష్ట్రంలో పార్టీల మార్పిడి వ్యవహారాలపై కేసును రూపొందించి విద్యార్థులకు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ముందు వాజ్యం దాఖలైన సందర్భంలో స్పీకర్ కు గల హక్కులు,విచక్షణ అధికారాలపై న్యాయ విద్యార్థిలకు వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయ శాస్త్ర కళాశాల ప్రిన్సిపాల్, విభాగాధిపతి డాక్టర్ కె ప్రసన్న రాణి, డాక్టర్ బి. స్రవంతి డాక్టర్ ఎం నాగజ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.