భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో పచ్చదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఏరువాభి కేంద్ర కోఆర్డినేటర్ డాక్టర్ బి అనిల్ కుమార్, తాసిల్దార్ అంజిరెడ్డి హాజరై, మాట్లాడారు. గ్రామస్తులు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, తమ పరిసరాలలో మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని , తద్వారా వర్షాకాలంలో రోగాల బారిన పడకుండా ఉండవచ్చని వివరించారు. అందరు విదిగా చెట్లు పెంచి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలన్నారు. గ్రామస్తులు పండ్ల లేదా ఔషధ మొక్కలను నాటాలని, పంట పొలాల్లో గ్రామ పరిసరాలలో పార్థినియం వయారిభామ కలుపు మొక్కలను లేకుండా చూసుకోవాలని కోరారు. పార్థీనియం మొక్కల వల్ల మనుషులకు , జంతువులకు శ్వాసకోశ , చర్మ సంబంధిత వ్యాధులు సోకే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం అంగన్వాడీ సబ్ సెంటర్ ఆవరణలో మొక్కల్ని నాటారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త కే మమత , పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ కుమార్, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు అలివేలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.