బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ముత్యాల రాజేందర్ యాదవ్

నవతెలంగాణ -మల్హర్ రావు: మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్, భూపాలపల్లి జిల్లా జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహర్షిని ఆదేశాల మేరకు మండలంలోని అన్సాన్ పల్లి బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ముత్యాల రాజేందర్ యాదవ్ ఏకగ్రీవంగా నియమించినట్లుగా మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కుంభం రాఘవ రెడ్డి సోమవారం తెలిపారు.ఈ కార్యక్రమంలో మంథని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుట్టపాక శ్రీనివాస్,మండల కోఆప్షన్ సభ్యులు అయుబ్ ఖాన్,కొండంపెట సర్పంచ్ అడ్డురి కుమార స్వామి, మండల ఉపాధ్యక్షులు బాపు యాదవ్, ఆయా గ్రామాల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.