ఈరోజు భీంగల్ మండలంలోని జాగీర్యాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో పెద్ద మొత్తంలో నీటి సమస్య ఉందని ఆ గ్రామవాసులు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు తెలుపగా, బోర్ బండిని పంపించి, ఆ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న నీటి సమస్యలు తీర్చే విధంగా ఎస్ డి ఎఫ్ నిధుల ద్వారా బోరు వేయడం జరిగింది. బోర్ వేయడం ద్వారా నీళ్లు సక్సెస్ అయ్యాయని ఆ కాలనీవాసులు, గ్రామ స్తులు ముత్యాల సునీల్ కుమార్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.