నవతెలంగాణ-నవీపేట్: మండల కేంద్రంలోని మాధవ విద్యానికేతన్ వ్యవస్థాపక అధ్యాపకులు మువ్వ నాగేశ్వర్ రావు గురుపూజోత్సవం సందర్భంగా శిష్య బృందం సోమవారం శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మువ్వ నాగేశ్వర్ రావు ఉపాధ్యాయుడిగా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వడ్డీ మోహన్ రెడ్డి, సత్యం రెడ్డి, ఆనంద్, బాలగంగాధర్, రాజేందర్ గౌడ్, నాగభూషణం, భూషణ్, రత్నాకర్, బండారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.