– ఆదిత్య సుభాష్ టెన్నిస్ అకాడమీ నిర్వాహకులు, చీఫ్ కోచ్ కే.నర్సింహ
నవతెలంగాణ-కూకట్‌పల్లి
కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్‌లోని, ఆదిత్య సుభాష్ టెన్నిస్ అకాడమీ ఆర్గనైజ్ చేసిన నాన్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అండర్ టెన్ ,అండర్ 12, అండర్ 14 బాలురు, బాలికలు మిక్స్డ్ ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. మెన్ సింగల్స్, డబుల్స్ కూడా నిర్వహించారు. ఇందులో 100 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వీరు పాల్గొనగా గెలుపొందిన వారికి బహుమతుల ప్రదా నం చేశారు. కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ తరఫున సీనియర్ జర్న లిస్ట్ మధుసూదన్ చారి ముఖ్యఅతిథిగా హాజరై టోర్నమెం ట్లో విజే తలుగా నిలిచిన వారికి మోమెంటోలు, మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆదిత్య సుభాష్ టెన్నిస్ అకాడమీ నిర్వాహకులు, చీఫ్ కోచ్ కే.నర్సింహ పాల్గొన్నారు.
మధుసూదన్ చారి, మాట్లాడుతూ విజేతలుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి పేరుపేరునా అభినందనలు తెలియజేశారు. క్రీడల్లో పాల్గొనడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంతేకా కుండా అంతర్జాతీయంగా క్రీడల్లో పాల్గొనడం వల్ల మన దేశానికి గర్వకారణం అని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడలకు ప్రోత్సాహం ఇస్తూ కే. నరసింహ తానే ఆర్గనైజర్‌గా ఉంటూ, కోచ్ గా కూడా వ్యవహరించడం ఎంతో సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పోటీలు మరెన్నో ఆయన నిర్వహించాలని భవిష్యత్తులో మంచి క్రీడాకారులను మన దేశానికి అందించాలని కోరారు. కే. నరసింహ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో ఆసక్తితో కనబరిచి తన దగ్గరికి వచ్చిన ప్రతీ ఒక్కరిని ఆదరించి వారికి సరైన శిక్షణ అందించి వారిని ఒక స్థాయిలో చూడాలన్నదే నా కోరిక అని తెలిపారు. ఇప్పటికే 40 నేషనల్ టైటిల్స్ కొట్టామని, ఇంకొంతమంది ఇంటర్నేషనల్ కోసం ట్రై చేస్తున్నట్టుగా తెలిపారు. ఇంకా ఇలాంటి క్రీడలను మరెన్నో ప్రోత్సహించి దేశానికి మంచి క్రీడాకారులని అందించడమే తన కర్తవ్యం అని తెలిపారు. అదేవిధంగా తాను చేస్తున్న ఈ కృషికి ప్రభుత్వం కానీ లేదా ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కానీ తోడుగా నిలిస్తే ఇంకా ఎన్నో అద్భుతాలు సష్టించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. క్రీడల్లో పాల్గొన్నందుకుగాను క్రీడాకారులకు కూడా భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ తమ కోచ్ అందించిన ప్రోత్సా హం, ట్రైనింగ్ వాళ్ళనే తాము ఈ విజయం సాధించగ లిగా మని, ఈ విజయం ఇంతటితో ఆగకుండా రాష్ట్రస్థాయిలో అంతర్రాష్ట్ర స్థాయిలో పాల్గొని మా సత్తా చాటుతామన్నారు.