సైన్స్ ద్వారా అందిన ఫలాలు సామాన్యునికి అందాలనేదే నా తపన 

నవతెలంగాణ – కంటేశ్వర్

సైన్స్ ద్వారా అందిన ఫలాలు సామాన్యునికి అందాలనేదే నా తపన అని జన విజ్ఞాన వేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్రావు  అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి కేంద్ర గ్రంధాలయంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వారు వ్రాసిన మీరు కుశలమేనా అనే పుస్తకానికి గాను  పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాగసూరి గౌరమ్మ సంజీవయ్య  కీర్తి పురస్కారాన్ని అందచేసిన సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మానవ మనుగడకు సైన్స్ మూలమని, ప్రశ్నయే  ప్రగతికి ఆధారమన్నారు. ఈ సందర్భంగా జేవీవీ సంస్థకు, సన్మానిఛ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభకు అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు కోయెడి నర్సింలు మాట్లాడుతూ.. సైన్సును నమ్ముకొని,అనేక సంవత్సరాలుగా  ప్రజల్లో ,విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహనను నింపుతో ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ సభలో ఐఎంఎ అధ్యక్ష, కార్యదర్శులు దామోదర్ రావు, శ్రీశైలములు మాట్లాడుతూ.. వారు అందరికి ఆదర్శమని, భార్యభర్తలిద్దరూవైద్య , ఆరోగ్య రంగాల్లో చాలా కృషి చేశారన్నారు. జేవీవీ రాష్ట్ర అధక్షులు నర్రా రామారావు మాట్లాడుతూ వారు వ్రాసిన పుస్తకాన్ని పరిచయం చేస్తూ, జేవీవీ లో సైన్సు, సామాజిక, సాంఘీక రంగాల్లో చేసిన కృషిని వివరించారు. వారి బాగాస్వామి డాక్టర్ జహాని నెహ్రు మాట్లాడుతూ సైన్సు, సామాజిక సేవ కార్యక్రమాల్లో తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు.రామ్మోహన్ రావు, డాక్టర్ సూరి, డాక్టర్ కవిత రెడ్డి, డాక్టర్ రాంచందర్, డాక్టర్ వినోద్ కుమార్ డాక్టర్ వెంకట్, ప్రముఖ కవి చందన్ రావులు మాట్లాడుతూ వారుచేసిన కృషికి పద్మ శ్రీ ఇవ్వవచ్చని అంటూ వారిని అభినందించారు. మండ్రు శ్రీనివాస్, రాజశేఖర్ తో పాటు ఈ సందర్భంగా అనేక మంది సన్మానించారు. జేవీవీ నాయకులు సంజీవరెడ్డి ఆహ్వానించగా, రామకృష్ణ వందన సమర్పణతో సభ ముగిసింది.