నా ప్రతి అడుగు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే

My every step is for the solution of public problems– పదేళ్లుగా పరిష్కారం కానీ ప్రతి సమస్యపై ప్రత్యేక దృష్టి..
– మార్నింగ్ వాక్ లో మాజీమంత్రి దామోదర్ రెడ్డి..
నవతెలంగాణ – సూర్యాపేట
నా ప్రతి అడుగు పదేళ్లుగా పరిష్కారం కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసమేనని మాజీ మంత్రి వర్యులు,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. మార్నింగ్ వాక్ లో భాగంగా సోమవారం ఉదయం పట్టణంలోని 20,21,36 వార్డుల్లోని పుల్లారెడ్డి చెరువు బ్రిడ్జ్ పరిశీలించి అక్కడికి నుండి 7, 22వ వార్డుల్లో రాజీవ్ నగర్  ప్రాంతాలలో పర్యటించి ట్రీట్మెంట్ ప్లాంటును పరిశీలించిన అనంతరం ఆయన ప్రజా సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించి మాట్లాడారు. పదేండ్ల పాలనలో శివారు ప్రాంతాలు వెనుక పడ్డాయని ఇక్కడ ప్రజలు సమస్యల పై వినతి పత్రాలు సమర్పించిన స్పందించలేదన్నారు.  రెండు నెలలపాటు సూర్యాపేట మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారం కానీ ప్రతి సమస్యను పరిష్కరిస్తానన్నారు.  వర్షాలు పడుతున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా శివారు ప్రాంతమైన మందుల వాడ లోని ప్రజలకు పారిశుధ్య సమస్య లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే 22వ వార్డులో 11 కెవి వైర్లు ప్రమాదకరంగా ఇండ్లపై నుంచి వెళుతున్నాయని గతంలో ఈ సమస్యను చెప్పినప్పటికీ పరిష్కరించలేదని  ఆ ప్రాంత వాసులు ఆయన దృష్టి కి తీసుకుని రాగ వెంటనే అక్కడికక్కడే విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. జమ్మిగడ్డ లోని ట్రీట్మెంట్ ప్లాంటును పరిశీలించి నాలలో మురుగు నీరు ఆగకుండా సక్రమంగా ట్రీట్మెంట్ నిర్వహించి ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా చేయాలని సూచించారు. దామన్న వార్డుల్లో తిరుగుతూ కనిపించిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తుండడంతో పదేళ్లుగా పరిష్కారం కానీ ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, ఈఈ ప్రసాద్,మూసి డీఈ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, కౌన్సిలర్లు బైరు శైలేందర్, బాలు గౌడ్,కుంభం రాజేందర్,ఆనంతుల యాదగిరి, రాపర్తి శ్రీను,శనగాని రాంబాబు గౌడ్,నరేందర్ నాయుడు, సాయి నేత, చంటిబాబు,చెంచాల శ్రీనివాస్, సిద్దిక్,ఖమృద్దిన్,కోడి సైదులు, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.