సరికొత్త పాయింట్‌తో.. నా నిరీక్షణ

సరికొత్త పాయింట్‌తో.. నా నిరీక్షణపికాక్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై పి.సంతోష్‌రెడ్డి నిర్మాణంలో అమర్‌ దీప్‌ హీరోగా, లిషి గణేష్‌ కల్లపు హీరోయిన్‌గా సాయివర్మ దాట్ల దర్శకత్వంలో రాబోతోన్న  చిత్రం ‘నా నిరీక్షణ’. దసరా సందర్భంగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు నిర్మాత సురేష్‌ బాబు ఆశీస్సులతో గ్రాండ్‌గా జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌  రాజు క్లాప్‌ కొట్టగా, రాజా రవీంద్ర స్క్రిప్ట్‌ అందజేశారు. నిర్మాత గణపతి రెడ్డి కెమెరా స్విచాన్‌ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ సాయి వర్మ దాట్ల మాట్లాడుతూ,  ‘సినిమా కథ గురించి ఇప్పుడే చెప్పలేను. అయితే ఓ మంచి చిత్రాన్ని మాత్రం తీస్తున్నానని కచ్చితంగా చెప్పగలను’ అని అన్నారు. ‘హీరోగా ఇది నా రెండో చిత్రం.  బిగ్‌ బాస్‌ తరువాత సెలెక్ట్‌ చేసుకున్న ఫస్ట్‌ స్క్రిప్ట్‌ ఇది. నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌’ అని అమర్‌ దీప్‌ చెప్పారు.లిషి  గణేష్‌ కల్లపు మాట్లాడుతూ, ‘ఇది నా రెండో చిత్రం. కథాకథనాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. సరికొత్త పాయింట్‌తో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ఓ మంచి పాత్ర చేస్తున్నా. ఇంత మంచి పాత్రను ఇచ్చిన మేకర్స్‌కు ధన్యవాదాలు’ అని అన్నారు. అమర్‌దీప్‌ చౌదరి, చైతన్య వర్మ, లిషి గణేష్‌ కల్లపు, రమ్య ప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత : పి.సంతోష్‌ రెడ్డి, కథ-స్క్రీన్‌ ప్లే-దర్శకత్వం :సాయి వర్మ దాట్ల, మాటలు : తిరుమలేష్‌ బండారు, కెమెరామెన్‌ : వి.రవి కుమార్‌, సంగీత దర్శకుడు : శేఖర్‌ చంద్ర.