నా పార్టీ ప్రజల సమస్యల మీద పోరాటం చేసే పార్టీ అదే సీపీఐ(ఎం)

– గ్రంథాలయము, మహిళా సంఘ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాంప్లెక్స్ ప్రారంభం
నవతెలంగాణ-యాదగిరిగుట్ట రూరల్ : నా పార్టీ ప్రజల పార్టీ, నా పార్టీ ప్రజల సమస్యల మీద పోరాటం చేసే పార్టీ, అదే సీపీఐ(ఎం) అని, గ్రామంలో ప్రజాశక్తి బలంగా ఉంది నా ప్రాణం ఉన్నంతవరకు అభివృద్ధికై పోరాటం ఆగదు అని పెద్ద కందుకూరు సర్పంచ్ భీమగాని రాములు అన్నారు. యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు బుధవారం, గ్రంథాలయము, మహిళా సంఘ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాంప్లెక్స్ ప్రారంభ కార్యక్రమం అనంతరం పత్రిక సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్కలలోని స్పృహ నా గ్రామానికి రావాలి. సీపీఐ(ఎం) పార్టీగా అన్ని పార్టీల మద్దతుతోని పెద్ద కందుకూరు గ్రామ సర్పంచ్ గా గెలుపొందాము అన్నారు.  గ్రామం ఇంతకుముందు 30, 40 సంవత్సరాలు ఏ విధంగా ఎనక పడ్డది, పక్కన ఒక వందల కోట్ల కంపెనీ ఏ విధంగా ఉపయోగించాలో ఆలోచించి, గమనించి, ఈ పది సంవత్సరాల కాలంలో 2013 కంటే ముందు మేనిఫెస్టోను రిలీజ్ చేసాము. గ్రామాలలో మౌలిక వసతులు మంచినీళ్ల వసతి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధిలైట్లు, సీసీ రోడ్లు 99 శాతం పూర్తి చేసామని అన్నారు. దాతను తీసుకువచ్చి పాఠశాలను నిర్మించామన్నారు. ఈ పాఠశాలను అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇచ్చే ప్రారంభించామని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ఏ నిర్మాణం చేపట్టిన గత ప్రభుత్వ ఎమ్మెల్యే నామీద అనేక కేసులు పెట్టించారని అన్నారు. ఇలా ఎన్ని బాధలు పెట్టిన మౌనంగా భరించి అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాను అన్నారు.   గ్రంధాలయం, ప్రాథమిక ఆసుపత్రి, మహిళా సంఘ కాంప్లెక్స్  దృఢ సంకల్పంతో నిర్మించమన్నారు. ఇంతకుముందు బిఆర్ఎస్ గవర్నమెంట్ అనేక ఇబ్బందులు, అభివృద్ధికి ఆటంకాలను కలిగించింది అన్నారు. మా తండ్రి గారి పేరు మీద ఊరిలో పోచమ్మ దేవాలయం నిర్మించామన్నారు. నిమ్మ గుండ్ల ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా నిర్మాణం చేసామన్నారు. గ్రామ అభివృద్ధి మీద అవగాహన లేక భూకబ్జాదారులు, భూ దోపిడీదారులు గత ప్రభుత్వ ఎమ్మెల్యే ద్వారా అనేక కుట్రలు చేయించారని అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక గత ప్రభుత్వ ఎమ్మెల్యే చాలా బాధలు పెట్టింది అన్నారు. గ్రామాలలో ప్రజలలో సామాజిక ప్రజలను దూరం చేయాలన్నారు. సామాజిక రుగ్మతలను సృష్టించే వాళ్లను తరిమేసి గ్రామాలు బాగు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి కాల్నె స్వామి మాట్లాడుతూ అనేక ఇబ్బందులను, కుట్రలను, రాజకీయ శక్తులను ఎన్నో అడ్డుకొని గ్రామంలో అభివృద్ధి, అన్ని మౌలిక సదుపాయాలు నెలకొల్పామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.