మండలంలోని రామారెడ్డి గంగమ్మ బ్రిడ్జి పనులను జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మండలం తోపాటు ఇతర జిల్లాల నుండి కామారెడ్డి జిల్లా కేంద్రానికి ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారని, బ్రిడ్జిని కాంట్రాక్టర్ తో త్వరగా పూర్తి చేయించాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు ను కోరగా, త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కాంట్రాక్టర్కు పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించినట్లు మోహన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మా గౌడ్, నాయకులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నర్సింగ్ రావు, గణేష్, రఫిక్ తదితరులు ఉన్నారు.