ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే నా బాధ్యత..

– అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్..
నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత నాది అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పులిపలుపుల గ్రామంలో  ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నూతన భవన నిర్మాణానికి 20 లక్షల, బీరెల్లి గూడెం గ్రామంలో  గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి 20 లక్షలు, కొరటికల్ గ్రామంలో  నూతనంగా నిర్మించే 33/11 కె వి విద్యుత్ సబ్స్టేషన్ కు 2 కోట్ల 30 లక్షల మంజూరైన నిధులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేయకుండా కుటుంబ అభివృద్ధి కోసం పాలన కొనసాగించిందని అన్నారు. రాబోయే నాలుగేళ్ల పాలనలో మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్, మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, మండల సీనియర్ నాయకులు దోటి నారాయణ, వట్టికోటి శేఖర్, అనంత స్వామి గౌడ్, మందుల బీరప్ప, ఎండి అన్వర్, పాల్వ జితేందర్ రెడ్డి, మేకల ప్రమోద్ రెడ్డి, మందుల సైదులు, దోటి శ్రీను, జిట్టగోని సైదులు, రిషి గౌడ్, వివిధ గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, మండల అధికారులు తదితరులున్నారు.