‘కార్యకర్తల్ని కాపాడడం కోసమే నా కుమారుడు పోటీ’

నవతెలంగాణ-త్రిపురారం
నాగార్జున సాగర్‌ ప్రజలు తనను 40 ఎండ్లుగా కాపాడుతూ వస్తున్నారు..వారిని కాపాడడం కోసం తన కుటుంబం నుండి జై వీర్‌రెడ్డిని ఈ ఎన్నికలలో దించుతున్నట్లు మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. ఆదివారం త్రిపురారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి అయన కుమారుడు జైవీర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. త్రిపురారం మండలం మునగ భావిగూడెం, కామా రెడ్డిగూడెం గ్రామాలకు చెందిన 25 కుటుంబాలు బీఆర్‌ఎస్‌ పార్టీ నుండి జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ ఎస్‌ పార్టీ మోసపూరిత ప్రకటనలతో మభ్యపెడుతూ కాలం గడుపుతున్నారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తాను అని చేయలేదన్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. నాగార్జున సాగర్‌ ప్రజలకు తన మీద ప్రేమాభిమానాలు తగ్గలేదు అని వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి వచ్చేలా చూడాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, కార్యనిర్వహక అధ్యక్షుడు బిట్టు రవి, జిల్లా కార్యదర్శి అల్లంపల్లి జానయ, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు అనుముల వెంకట్‌రెడ్డి, నర్సి, పీబీ.రవి, పాండు, కోఆప్షన్‌ మెంబర్‌ హుస్సేన్‌, పొలగాని సైదులు, పద్మ, హనుమయ, అశోక్‌, రామకష్ణ, తదితరులు పాల్గొన్నారు.