సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులందరికి నా ధన్యవాదాలు

– కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి 
నవతెలంగాణ –  కామారెడ్డి 
శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని వారికి అందించే సహాయ చర్యలో పాల్గొన్న అధికారులందరికీ నా ధన్యవాదాలు అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
  శనివారం రాత్రి 9 నుండి ఆదివారం రాత్రి 12  వరకు కురిసిన అతి భారీ వర్షాలకు దేవునిపల్లి, కాకతీయకాలనీ, టెక్రియల్, నిజంసాగర్ రోడ్, సిఎస్ఐ  చర్చి ప్రాంతం, అశోకనగర్,  కేపీఆర్ కాలనీ, సైలన్ బాబాకాలనీ, టీచర్స్ కాలనీ, గాంధీనగర్ , బతుకమ్మకుంట, అయ్యప్పకాలనీ, హరిజనవాడ,  స్టేషన్ రోడ్, పంచముఖి హనుమాన్ టెంపుల్ లను సోమవారం ఉదయం ప్రాంతాలను శనివారం ఉదయం ఎమ్మెల్యే కటిపల్లి వెంకటరమణ రెడ్డి  పర్యవేక్షించరు.  గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని అన్ని చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయని, అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకి రావద్దనీ విజ్ఞప్తి చేశారు. వరద, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు అందరూ అధికారులకు సహకరించాలని కోరారు.
ప్రస్తుతం పరిస్థితి అంతా క్షేమంగానే ఉందని అన్నారు. మొన్న రాత్రి కురిసిన వర్షం కు చెరువులు నిండి మత్తడి పై నుండి నీరు పొంగడం జరిగింది. జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడం జరిగింది ఇప్పటికి జరుగుతుంది
– ఎలక్ట్రిసిటీ అధికారులు విద్యుత్ సమస్యలు రాకుండా చూస్తున్నారు
– వరద, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– ఇళ్లలోకి, కాలనిలోకి నీరు వచ్చిన దగ్గర మున్సిపల్ అధికారులు మరియు  రోడ్స్ & బిల్డింగ్  ఇరిగేషన్  అధికారులు మరియు ఫైర్ & పోలీస్ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
– సహాయకచర్యల్లోపాల్గొన్న అధికారులందరికి నా ధన్యవాదాలు
నేడు ఉదయం  కామారెడ్డి పట్టణ చెరువు, టెక్రియాల్ చెరువు  లింగాపూర్ చెరువు మరియు హౌసింగ్ బోర్డు  జీఆర్ కాలనీ పరిధిలోని ముంపు ప్రాంతాలను సందర్శించి పాదచారులతో మరియు కాలని వాసులతో మాట్లాడటం జరిగింది. అలాగే  నిన్న రాత్రి 9 pm నుండి 12 pm వరకు దేవునిపల్లి కాకతీయకాలనీ టెక్రియల్ పర్ణికాపాలస్ రోడ్  చర్చి అశోకనగర్  కేపీఆర్ కాలనీ సైలన్ బాబాకాలనీ టీచర్స్ కాలనీ గాంధీనగర్  బతుకమ్మకుంట అయ్యప్పకాలనీ హరిజనవాడ  స్టేషన్ రోడ్ పంచముఖి హనుమాన్ టెంపుల్  పర్యవేక్షించడం జరిగింది.
అనంతరం కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని అన్ని చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయని, అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకి రావద్దనీ విజ్ఞప్తి చేశారు. వరద, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే ప్రజలు అందరూ అధికారులకు సహకరించాలని కోరారు.
ప్రస్తుతం పరిస్థితి అంతా క్షేమమే..