నవతెలంగాణ – నసురుల్లాబాద్
వాతావరణ మార్పులు. తరచూ వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో పారిశుధ్యం క్షీణించి దోమలు విజృంభించడంతో విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న తరాణంలో గ్రామపంచాయతీ తాళం వెయ్యడంతో స్థానిక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అంటూ స్థానిక సీనియర్ నేత మేకల రాములు ఆవేదన వ్యక్తం చేశాడు. నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామ పంచాయతీ కార్యదర్శి పంచాయతీ గధులకు తాళం వేసి గ్రామ సమస్యలను తుంగలో తొక్కుతున్నారని ఆయన అన్నారు . వాతావరణంలో మార్పులు భారీ వర్షాలు పడుతున్నాయి ఇప్పటివరకు దోమల మందు కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ డ్రైనేజీలు క్లినింగ్ కానీ పట్టించు కోవడం లేదని, నసురుల్లా బాద్ ఎంపీడీవో మరియు ఎంపీఓ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ఉన్న అపరిశుభ్రత దోమల నివారణకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.