నవతెలంగాణ-నిజాంపేట
మండల పరిధిలోని కాసింపూర్ తాండ, కాసింపూర్, రజాక్ పల్లి, కల్వకుంట గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు టపాకా యలు పేల్చుతూ.గిరిజనుల నత్య ప్రదర్శన మధ్య మైనంపల్లి రోహిత్‌కు ఘన స్వాగతం పలికారు. రజాక్ పల్లిలో హనుమాన్ మందిరంలో పూజలు చేసిన అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మైనంపల్లి సేవా సమితి మైనాపల్లి సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామన్నారు. తండాలు, గ్రామాలు, ఊరు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలన్నారు. అనంతరం కల్వకుంట గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడ్డ హరీశ్‌రావును జైలుకు పంపడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, మండల అధ్యక్షుడు మారుతి, పల్లె రామచంద్ర గౌడ్, చలిమేటి నరేందర్, ముత్యాల మధుసూదన్ రెడ్డి, మోహన్ రెడ్డి,, సామల మహేష్, పంజా బాబు, అందే స్వామి, బోయిని చంద్రం, వెంకటేష్ గౌడ్, అజరు, గోపాల్, పంజా శ్రీనివాస్, మసూద్, జాల శ్రీకాంత్, పల్లె, ధరావత్ విఠల్, సులేమాన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.