ముర్రు పాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కారం

Myrrh milk is very beneficial for the baby– రోగ నిరోధక శక్తి పెంచుతుంది: అంగన్వాడి టీచర్ అంజవ్వ

– డోంగ్లి మండలంలో 33 అంగన్వాడి కేంద్రాల్లో అన్న ప్రసన్న కార్యక్రమాలు
నవతెలంగాణ – మద్నూర్
తల్లిపాల వారోత్సవాలు భాగంగా మద్నూర్ ఉమ్మడి మండలంలోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలోని సిర్పూర్ గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్పూర్ అంగన్వాడి కేంద్ర టీచర్ అంజవ్వ మాట్లాడుతూ.. పుట్టిన గంటలోపే బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని ముర్రుపాలు పుట్టిన బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు. తల్లిపాల వారోత్సవాలు భాగంగా డోంగ్లి మండలంలోని 33 అంగన్వాడి కేంద్రాల్లో అన్న ప్రసన్న కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి సెంటర్లో తల్లులకు ముర్రు పాల గురించి అవగాహన కల్పించారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారి పిల్లలకు చదువులో పాటు పౌష్టికాహారం లభిస్తుందని తల్లులకు కూడా  పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందని అంగన్వాడీ టీచర్లు తెలిపారు. గర్భిణీలు బాలింతలు చిన్నారి పిల్లల తల్లులు అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు.