నవతెలంగాణ – నెల్లికుదురు
పుట్టిన బిడ్డకు గంటలోపే తల్లి ముర్రు పాలు పట్టించినట్లయితే రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతులు ఎదుగుతారని ఐ సి డి ఎస్ ,సి డి పి ఓ విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని తల్లిపాల వారోత్సవాలు భాగంగా అవగాహన కార్యక్రమాన్ని శనివారం సూపర్వైజర్ నాగమణితో కలిసి ర్యాలీ నిర్వహించి తగు సూచనలు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిపాల వారోత్సవాల భాగంగా తల్లిపాల గురించి తల్లులకు అవగాహన కల్పించామన్నారు. పుట్టిన బిడ్డకి గంటలోపే ముర్రుపాలు పట్టిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. పిల్లలకు ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలని అన్నారు. అంతేకాకుండా పిల్లలకు ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల లోపు అదనపు ఆహారం పెట్టాలని తల్లులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగమణి విజయ అంగన్వాడీ టీచర్స్ మద్ధి విజయ ఐ పద్మ నలుమాస శ్రీలక్ష్మి పి రాజేశ్వరి లక్ష్మీనర్సమ్మ ఎం పద్మ మంజుల కే పద్మ వరలక్ష్మి సునీత డి కవిత ఎం కవిత కవిత సరూప బానోతు పద్మ తదితరులు పాల్గొన్నారు.