నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్ ఇన్‌చార్జి చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎమ్‌డీ)గా ఎన్ బలరాం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతా మన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని కొత్త గనులు చేపట్టి, కార్మికుల సంక్షేమాన్ని విస్తరిస్తామన్నారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నిం టికీ బొగ్గు కొరత లేకుండా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సింగరేణి అభివృద్ధితో పాటు సమీప గ్రామాల అభివృద్ధిని కూడా ప్రాధాన్యతాంశంగా పరిగణిస్తూ సామాజిక బాధ్యతా కార్యక్రమాలను విస్తతపరుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ని సింగరేణి మాజీ డైరెక్టర్(ఫైనాన్స్, పర్సనల్) పవిత్రన్‌కుమార్, సెంట్రల్ కోల్ ఫీల్ట్స్ చైర్మెన్, కోలిండియా డైరెక్టర్ టెక్నికల్ బీ వీరారెడ్డి, సింగరేణి డైరెక్టర్లు ఎన్.వి.కె.శ్రీనివాస్ (ఆపరేషన్స్), జి.వెంకటేశ్వరరెడ్డి(ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), ఈడీ(కోల్ మూమెంట్) జె.అల్విన్, జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం సేఫ్టీ గురవయ్య, సింగరేణి అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.వి.రాజశేఖరరావు తదితరులు అభినందనలు తెలిపారు.