ఎన్నికల్లో మోసపూరిత హామీలను ఇచ్చి, ప్రజలను వంచించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలను మోసం చేసిందని మంగళవారం మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు రు 15000 రైతుబంధు అందిస్తానని, మోసం చేసి రూ 12000 ఇస్తామని ప్రకటించటం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్న రైతులకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. రైతు రుణమాఫీ కొర్రీలు పెడుతూ 40 శాతం రుణమాఫీ మాత్రమే చేశారని అన్నారు. ఒక కోటి యాభై లక్షల ఎకరాల ఆయకట్టును, కాంగ్రెస్ ప్రభుత్వం 70 లక్షల ఎకరాలకు తగ్గిస్తుందని అన్నారు. ప్రతి పంటకు రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వని ఎడల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరుగనివ్వమని హెచ్చరించారు. కెసిఆర్ ను దూరం చేసుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సలావత్ బుచ్చిరెడ్డి, గ్రామ అధ్యక్షులు బానూరి నర్సారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, నాయకులు ప్రభాకర్ రావు, రాజా గౌడ్, పడిగల శ్రీనివాస్, కడెం శ్రీకాంత్, కర్రెo బాలరాజు, గజ్జల శంకర్, తోట లింగం, పోతునూరి ప్రసాద్, జంగం లింగం తదితరులు పాల్గొన్నారు.