తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని సోమవారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ హాస్టల్లో, గురుకులాలతోపాటు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు డైట్, కాస్మోటీస్ చార్జీలను పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తుందని అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీ లో విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలను నిర్వహించారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసి, పట్టించుకున్న పాపన పోలేదని ఎద్దేవా చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గి రెడ్డి మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మా గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్ మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంబాయి ప్రసాద్, నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బండి ప్రవీణ్, దుంపల బాలరాజు, మహమ్మద్ అనీఫ్, చింతకుంట కిషన్, పోతుల పెద్ద భాస్కర్ రెడ్డి, నామాల రవి, పిప్పిరి గణేష్, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.