మతిభ్రమించి మాట్లాడటం సరైనది కాదు: నా రెడ్డి మోహన్ రెడ్డి

నవతెలంగాణ – రామారెడ్డి
అధికారం కోల్పోయి హరీష్ రావు మతిభ్రమించి మాట్లాడటం సరైనది కాదని సోమవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారం కోల్పోగానే ప్రజలకు ఏదో ఒరగ పెడుతున్నట్టు నటించడం, మీ అధికార దాహానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాంనగర్ లో అద్దె ఇంట్లో ఉండి, అద్దె కట్టకపోతే ఓనర్ ఇల్లు ఖాళీ చేయించింది నిజం కాదా, ఇల్లు కిరాయి కట్టని నీవు, 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కోట్లకు కోట్లు ఎలా సంపాదించావని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణను పది సంవత్సరాలు మీ కుటుంబం దోచుకున్నది చాలదాని ప్రశ్నించారు. మామ ఫామ్ హౌస్ లో, బామ్మర్ది అమెరికాలో ఉంటూ అడ్డగోలుగా మాట్లాడటం మానుకోవాలని, కేసీఆర్ను రైతులకు రుణమాఫీ చేయకుండా, దళిత బంధు ఇచ్చి ఇవ్వ నట్లు, రాష్ట్రవ్యాప్తంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా చేసింది నువ్వే అని అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే వారి మధ్యలో ఉంటూ సాధకబాధకాలు తెలుసుకొని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ప్రతిపక్ష హోదాలో సూచనలు చేస్తూ, ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వానికి సహకరించ వలసిన మీరు, ఆపదలో ఉన్న ఖమ్మం, వరంగల్ ప్రజల వద్దకు వెళ్లకుండా, మహిళలను కించపరుస్తూ, రౌడీల, గుండాల సమాజం కు పట్టిన చీడపురుగు అయినా కౌశిక్ రెడ్డి వద్దకు వెళ్లినప్పుడే మీ నైజం, మీ జెండా, అజెండా ప్రజలకు అర్ధమైపోయిందని,. కానీ మైకు దొరికింది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే, ప్రజల ఆగ్రహానికి ఆహుతై పోతారని పేర్కొన్నారు.