ప్రజలకు సేవలు అందించడంలో అధికారుల పాత్ర కీలకమైనది: నా రెడ్డి మోహన్ రెడ్డి

నవతెలంగాణ- రామారెడ్డి
 ప్రభుత్వ పథకాలు అమలు కావటంలో, ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించడంలో అధికారుల ది కీలక పాత్ర అని, బుధవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణపై  ఎంపీడీవో సవితారెడ్డి అధికారులకు అవగాహన కల్పించారు. మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలు సమస్యలపై ఎలాంటి దరఖాస్తులు ఇచ్చిన పండగల స్వీకరించాలని, గత తొమ్మిది సంవత్సరాలు నిరంకుశ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారంటీల దరఖాస్తులను తీసుకొని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్ సిబ్బంది, ఐకెపి సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.