బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నా రెడ్డి మోహన్ రెడ్డి

నవతెలంగాణ- రామారెడ్డి
 మండలంలోని రెడ్డి పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కాసిం తండ్రి అనారోగ్యంతో మృతిచెందగా గురువారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి పరామర్శించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కుమ్మరి శంకర్, రఘోత్తమ రెడ్డి, సున్నపు మహేష్, బద్ది సతీష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.