జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సభ్యులు సురేష్ షెట్కర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి వారికి శాలువాతో సన్మానించారు. రైతు రుణమాఫీ చేసి మొదటిసారి కామారెడ్డి కి విచ్చేసినందుకు అభినందనలు తెలిపారు. రైతు రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, వ్యవసాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గండ్ర నరసింహులు, నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పోతుల చిన్న భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.