నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సహకారంతో హైదరబాద్ న్యాక్ బృందం ఆధ్వర్యంలో గల్ఫ్ లో ఉపాధి పొందాలి అనుకున్న వారికి శిక్షణ తరగతుల కోసం రిజిస్ట్రేషన్ న్యాక్ నమోదు ప్రక్రియ నిర్వహించింది. ఈ సందర్భంగా న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ అన్వర్ మాట్లాడుతూ వివిధ విభాగాల్లో నాణ్యమైన శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుందని దీని ద్వారా విదేశాలలో ఉపాధి పొందడానికి సులభంతరమవుతుందని శిక్షణలో భోజనం మరియు వసతి సౌకర్యం ఉంటుందని పని చేయాలని తపన ఉండాలి అని ఏజెంట్లు నమ్మి మోసపోకూడదని , ఇటీవల శిక్షణ పొందిన వారికి గ్రీస్ దేశంలో ఉపాధి కోసం టామ్ కమ్ ఈ నెల 25న నిజామాబాద్ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు వివిధ విభాగాల్లో శిక్షణ పొందడానికి దరఖాస్తు కోసం సుమారు 500 మంది ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చినారు.