– రెండు రోజుల పాటు పర్యటించి నివేదిక సేకరణ
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పట్టణంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాల (బోథ్) ను న్యాక్ బృందం సందర్శించింది. దేశవ్యాప్తంగా కళాశాలలో నాణ్యత ప్రమాణాలపై ఇచ్చే గుర్తింపు ప్రక్రియలో భాగంగా న్యాక్ బృందం రెండు రోజులపాటు కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా బోధన పద్ధతులు సౌకర్యాలను, వసతులను పరిశీలించారు. కళాశాలలోని విద్య ప్రమాణాలు ఎలా ఉన్నాయో పరిశీలించి వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. నాణ్యత ప్రమాణాల ఆధారంగా గ్రేడ్లు కేటాయించేందుకు నివేదికను స్టీల్ కవర్లో బెంగళూరులోని న్యాక్ కేంద్రానికి పంపారని కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీప్రసన్న తెలిపారు. న్యాక్ బృందంలో ప్రొఫెసర్ ప్రతాప్ జ్యోతి, హ్యాండిక్యూ వైస్ ఛాన్స్లర్ గౌహతి యూనివర్సిటీ అస్సాం, ప్రొఫెసర్ జయరాజ్ ఆమీన్ మంగళూరు యూనివర్సిటీ, ప్రొఫెసర్ లక్ష్మణ్ పుణె కళాశాల, గురుకుల సంక్షేమ విద్యా సంస్థ నుండి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ సతీష్ గౌడ్, కళాశాల అధ్యాపకులు ఉన్నారు.