మార్కెట్ కమిటీ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించండి: నడ్డి శివకృష్ణ యాదవ్

నవతెలంగాణ – పెద్దవూర
మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి ప్రేమ అభిమానం పొందిన నాయకుడు ,ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి ,ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ల అనుచరుడు, కర్నాటి లింగారెడ్డి ప్రియ శిష్యుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి అభిమాని, పోరాట యోధుడు నడ్డి శివకృష్ణ యాదవ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో వెనకడుగు వేయకుండా ముందు నడిచి పోలీస్ కేసులను సైతం ఎదుర్కొని గత 2009 ఎలక్షన్స్ నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉంటూ ఊరి ప్రజలతో మమేకం అయ్యారు.జానారెడ్డి గెలుపులో, ఎంపీ, ఎమ్మెల్యే గెలుపులో ప్రత్యక్షంగా పాల్గొని విజయతీరాలకు చేరుటకు ముఖ్య పాత్ర కూడ పోషించారు. నోముల నరసింహాయ్య మరణం అనంతరం వచ్చిన బై ఎలక్షన్ లో ఇంచార్జిగా వచ్చిన నేతలు బయపెట్టినప్పటికీ ఆత్మ స్థైర్యం తో ముందుకు నడిచారు.ప్రలోబాలకు గురి చేసిన వాటిని అన్నిటిని లెక్కచేయకుండా జానారెడ్డి అండ కాంగ్రెస్ జెండా అనే నినాదంతో ముందుకు సాగిననేత శివకృష్ణ,గత 2023 ఎలక్షన్ లో నోముల భగత్ ఎమ్మెల్యే గా శిలా పలకలు వేస్తుంటే శిలా పలకలు మాకు వద్దు బ్రిడ్జ్ నిర్మాణాలు చేపట్టండి ఎదురు చెప్పిన నేత, గత పాలకుల నిర్ణయాలను ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ప్రశ్నించినయువనేత శివ కృష్ణ, ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టిన యువ నాయకుడు.స్థానిక  ఎమ్మెల్యే, ఎంపి దయచేసి మీ గెలుపులో కష్ట పడిన మాయాదవ బిడ్డ, జానారెడ్డిని దేవుడిలా భావించే  యాదవ బిడ్డ కు హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించాలని నాగార్జున సాగర్ నియోజకవర్గం యాదవ బిడ్డల తరుపున కోరుతున్నాము.