
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని నడ్పల్లి గ్రామ పంచాయతి కార్యాలయంలో ఈ నేలా 11 న సోమవారం ఉదయం 10:30 గంటలకు తైబజార్ బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, మెజర్ గ్రామ పంచాయతీ గ్రేడ్ 1 కార్యదర్శి నిట్టు కిషన్ రావు గురువారం తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ప్రభుత్వ నిభందనలను పాటించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. వేలంలో పాల్గొనే వారు 50 వేల రూపాయలు ముందుగా గ్రామ పంచాయతీలో డిపాజిట్ గా చెల్లించి రశీదు పొందాలని సూచించారు. డిపాజిట్ చెల్లించిన వారికి మాత్రమే వేలంలో పాల్గొనడానికి అనుమతించ బడుతుందని పేర్కొన్నారు. గతేడాది కౌలు బకాయిలు ఉంటే పంచాయతీకి చెల్లించాల్సి ఉంటుందని, పంచాయతీ లోఎలాంటి బకాయిలు ఉన్నా వేలం పాటలో పాల్గొవద్దని తెలిపారు. లక్ష రూపాయల ఆస్తి, ధృవ పత్రం సంభందిత పంచాయతీల నుండి, పంచాయతి కార్యదర్శుల సంతకంతో జారీ చేయబడి ఉండాలని పేర్కొన్నారు. యజమాని సంతకం దృవపరచి ఉంటేనే అంగీకరించ బడుతుందని వివరించారు. చివరి పాట పాడి వేలం దక్కించుకున్న వారు చెల్లించిన డిపాజిట్, ధరావత్తు కలుపుకొని నాలుగో వంతు చెల్లించాలని వివరించారు. వేలంలో కనీస ధర రాని పక్షంలో రద్దు పరచే అధికారం గ్రామ పంచాయతీకి ఉందని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీ ఆమోదించబడిన రేట్లను మాత్రమే వసూళ్ళు చేయవల్సి ఉంటుందని, అంతకు మించి వసూలు చేస్తే వేలం ను రద్దు చేస్తామని తెలిపారు. వేలం పాడుకున్నవారు ఏదైన కారణాలతో నెలసరి వాయిదాలు చెల్లించకపోతే వేలం హక్కులు రద్దు చేసి తిరిగి వేలం వేసే అధికారం పంచాయతీకి ఉందని పేర్కొన్నారు. రెండవ వేలం ద్వారా వచ్చిన నష్టాన్ని మొదటి వేలం పొందిన వ్యక్తి నుండి వసూలు చేయబడుతుందని వివరించారు. వేలం కు భారీగా తరలి వచ్చి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.