నాడు పోచారం లక్ష్మీ పుత్రుడు.. నేడు ఐరన్ లెగ్ పుత్రుడు

Pocharam was the son of Lakshmi.. Today he is the son of Iron Leg– రాజీనామా చేసి ఎన్నికల్లో గెలుపొందాలి తెరాస డిమాండ్
– మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
బాన్సువాడ నియోజకవర్గంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన  నాయకులను, కార్యకర్తలను రాజకీయ పరంగా ఎదగనివ్వకుండా ఓటు బ్యాంకుగా వాడుకున్నారని బాన్సువాడ బీఆర్ఎస్ నాయకుడు షేక్ జుబేర్ ఆరోపించారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని జుబేర్ నివాసం వద్ద బీఆర్ఎస్ నాయకులతో కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నియోజకవర్గం టిఆర్ఎస్ నేత షేక్ జుబేర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రధాన నాయకులపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన హుందాతనానికి తగదని, రుణమాఫీపై ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే తప్పేమిటని ప్రశ్నించారు. బాన్సువాడ నియోజకవర్గంలో గత 30 ఏళ్లుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా స్పీకర్ గా పనిచేసినప్పటికీ తన కింద ఉన్న నాయకులు కార్యకర్తలను ఎదిగనివ్వకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం వెంట ఉన్న నాయకులు ఎవరైనా రాష్ట్రస్థాయి పదవులు పొందారా అంటూ ప్రశ్నించారు. ఏ పదవిలో వచ్చినా తమ కుటుంబ సభ్యులకే  అని అన్నారు. గత 30 ఏళ్లుగా నియోజకవర్గంలో నిజంగా పేదలు పేదవాలు గానే ఉన్నారని ఉన్నవాళ్లు ఉన్నవాళ్లగనే ఎదుగుతున్నారని అని అన్నారు. ఏదైనా సమస్య ఉందని నేరుగా ఎమ్మెల్యేకు కలిసే పరిస్థితి లేదన్నారు. సామాన్య వ్యక్తి ఎమ్మెల్యేని కలవాలంటే తన కిందిస్థాయి వ్యక్తిగత సహాయకులను కలవాల్సిందే. ప్రజల సమస్యలు ఎప్పుడు వింటారు అంటూ ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి  లక్ష్మి పుత్రుడు అని కాంగ్రెస్ పార్టీలో ఐరన్ లెగ్ పుత్రుడుగా మిగిలిపోయారని ఆయన ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలుపొందాలని ఆయన డిమాండ్ చేశారు. నిజంగా మీరు ప్రజలకు సేవనే చేసి ఉంటే ప్రజలు తప్పకుండా మీకు గెలిపిస్తారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో సేవలు చేయడమేమిటి అని ఆయన ప్రశ్నించారు సీనియర్ నాయకులు అయ్యుండి మీరు ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీకి సేవ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు రావడంతో బాన్సువాడ నియోజకవర్గంలో మూడు కాంగ్రెస్ పార్టీ గ్రూపులుగా విడిపోయాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.