ధూతగా నాగచైతన్య

ధూతగా నాగచైతన్యవిక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి బ్యానర్‌పై శరత్‌ మరార్‌ నిర్మించిన సిరీస్‌ ‘ధూత’. సూపర్‌ నేచురల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో నాగ చైతన్య ప్రధాన పాత్ర పోషించారు. పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్‌, ప్రాచీ దేశారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లోని ప్రైమ్‌ మెంబర్స్‌కు డిసెంబర్‌ 1 నుంచి ప్రైమ్‌ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో సిరీస్‌లోని మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ప్రసారం కానున్నాయి. ఇందులో నాగచైతన్య సక్సెస్‌ ఫుల్‌ జర్నలిస్ట్‌ సాగర్‌ పాత్ర పోషించారు. తనకి కొన్ని ఊహించిన సంఘటనలు, మిస్టీరియస్‌ మరణాల, అతీంద్రియ సంఘటనలు ఎదురై, అతని కుటుంబంపై నీడలా వెంటాడుతాయి? అనేది ఈ సిరీస్‌. నిర్మాత శరత్‌ మరార్‌ మాట్లాడుతూ, ‘అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు సిరీస్‌లలో ఇదొకటి. ఇది నాగచైతన్యకు గొప్ప స్ట్రీమింగ్‌ అరంగేట్రం అవుతుంది. అనూహ్యమైన కథనంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందిస్తున్న ప్రైమ్‌ వీడియోకు ధన్యవాదాలు’ అని చెప్పారు.