చిన్నారికి నాగజ్యోతి ఆత్మీయ ఆశీర్వాదం..

To the child, Naga Jyoti is a spiritual blessing..నవతెలంగాణ – తాడ్వాయి 
పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న చిడెం వేదాన్ష్ కు, ములుగు జడ్పీ మాజీ చైర్ పర్సన్,  బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇంచార్జీ బడే నాగజ్యోతి ఆత్మీయ ఆశీర్వాదం అందించారు. బుధవారం మండలంలోని మేడారం మాజీ సర్పంచ్ చిడెం బాబూరావు మనుమడు వేదాన్ష్ పుట్టిన రోజు వేడుకలకు హాజరైన బడే నాగజ్యోతి నూతన వస్త్రాలను బహుకరించి, అక్షింతలు వేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో బడే నాగజ్యోతి తో పాటు బిఆర్ ఎస్ తాడ్వాయి మండల అధ్యక్షుడు దండగుల మల్లయ్య, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ దుర్గం రమణయ్య, మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు కాక లింగన్న, రేగ నరసయ్య, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, మాజీ జెడ్పిటిసి రామసాయం శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాయం నరసింహారావు, సీనియర్ నాయకులు పత్తి గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచులు చిడం బాబురావు, గొంది శ్రీధర్, ఊకే మోహన్ రావు, నాయకులు సిద్ధబోయిన శివరాజు, ఎట్టి జగదీష్, బాలరాజు, అంకంపల్లి గ్రామ సర్పంచ్ ,గ్రామ పార్టీ అధ్యక్షులు గజ్జల సమ్మయ్య, మహేష్, పీరీల నరేష్, రంగు సత్యం, పాయం సమ్మయ్య, కొమరయ్య, ఇందారపు లాలయ్య, దానుక నర్సింగరావు, సాయిరి లక్ష్మీ నర్సు, మేడిశెట్టి నరసింహయ్య, ముక్తి రామారావు, వెంకటేష్, పెండగట్ల కృష్ణ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.